Pakistan | పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనకారులపై కాల్పులు.. 16 మంది మృతి.. 37 మందికి గాయాలు
Pakistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనలు ఆగడం లేదు. నిరసనకారులకు, పాక్ ఆర్మీకి మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఆందోళనకారులపై పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 16 మంది మరణించగా, 37 మందికి పైగా గాయపడ్డారు.
Pakistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనలు ఆగడం లేదు. నిరసనకారులకు, పాక్ ఆర్మీకి మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఆందోళనకారులపై పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 16 మంది మరణించగా, 37 మందికి పైగా గాయపడ్డారు. పీవోకే పరిధిలోని రావల్కోట్లోని ఈద్గా గ్రౌండ్లో ఆందోళనకారులు నిరసనలు చేస్తుండగా, వారిపై పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది.
నిరాయుధులైన వేలమంది ఇక్కడ ఆందోళన చేస్తుండగా వారిపై పాక్ ఆర్మీ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ప్రజలకు సరైన హక్కులు దక్కడం లేదు. దీంతో అక్కడివారు తమకు తక్కువ ధరకే బియ్యం, పిండి, విద్యుత్ వంటివి అందించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనల్ని అణచివేయడానికి పాక్ ప్రభుత్వం హింసాయుత చర్యలకు దిగుతోంది. తాజా ఘటనకు సంబంధించి గురువారం 60,000 నుంచి 70,000 మంది స్థానికులు ఇక్కడ సమావేశమయ్యారు. పురుషులు, స్త్రీలు, యువత సహా అందరూ ఆందోళన చేస్తుండగా ఆర్మీ కాల్పులు జరిపింది.
ఘటన తర్వాత ఆ ప్రదేశమంతా రక్తపు మరకలతో నిండిపోయింది. గత శుక్రవారం నుంచి పీవోకేలో ఆందోళనకారులపై పాక్ జరిపిన కాల్పుల్లో 57 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. పాక్ ఆర్మీ ఇంతగా అణచివేస్తున్నా అక్కడి ప్రజలు తమ ఆందోళనల్ని విరమించడం లేదు. తమకు హక్కులు కావాలని, ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పాక్ ప్రభుత్వ చర్యలపై మండిపడుతున్నారు. ఆర్మీ సిబ్బంది తీవ్రవాదుల్లా ప్రవర్తిస్తూ దాడులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

