భారత్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లిన నౌక.. సిబ్బందికి కరోనా పాజిటివ్
దక్షిణాఫ్రికా| భారత్ నుంచి సుమారు మూడు వేల టన్నులకు పైగా బియ్యం లోడుతో దక్షిణాఫ్రికాకు వెళ్లిన ఓ నౌకలో 14 మంది సిబ్బందికి కరోనా పాటిజివ్‌గా నిర్ధారణ అయ్యింది.

జొహన్నెస్‌బర్గ్: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి వెళ్లే విమానాలపై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించాయి. ఇక నౌకలపై కూడా ఆంక్షలు విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. భారత్ నుంచి సుమారు మూడు వేల టన్నులకు పైగా బియ్యం లోడుతో దక్షిణాఫ్రికాకు వెళ్లిన ఓ నౌకలో 14 మంది సిబ్బందికి కరోనా పాటిజివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ భారీ కార్గో నౌక డర్బన్‌కు వచ్చిందని, ఈ నేపథ్యంలో అందులో ఉన్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారికి పాజిటివ్ వచ్చిందని దక్షిణాఫ్రికాకు చెందిన ట్రాన్స్‌నెట్ నేషనల్ పోర్ట్ అథారిటీ నిర్ధారించింది.
ప్రస్తుతం ఆ నౌక క్వారంటైన్లో ఉందని, అందులోకి వెళ్లడానికి, బయటకు రావడానికి ఎవరికీ అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. వారిని ఎవరెవరు కలిశారనే విషయాన్ని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. కాగా, ఆ నౌకలో గత ఆదివారం నుంచి సుమారు 200 మంది పోర్టు సిబ్బంది పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. వారంతా 3 వేలకు పైగా టన్నుల బియ్యాన్ని అందులోనుంచి దించుతున్నారని పేర్కొన్నాయి. అందులో 50 కిలోల బ్యాగుల్లో బియ్యం ఉన్నదని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఢిల్లీ హాస్పిటల్లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
తమిళనాడులో విషాదం.. ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగుల మృతి
కంగన ట్విట్టర్ ఖాతాపై వేటు
కరోనా ఎఫెక్ట్.. ఏపీలో నేటి నుంచి 18 గంటల కర్ఫ్యూ
వచ్చే వారంలో కోవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Cargo ship
- Covid-19
- Durban
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

