Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dussehra Celebrations | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసంలో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి.
Dussehra Celebrations | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసంలో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రవెల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి కేసీఆర్ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
వేద పండితుల సమక్షంలో వాహన పూజ, ఆయుధ పూజలు నిర్వహించిన కేసీఆర్.. అనంతరం శమీవృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకల్లో కేసీఆర్ సతీమణి శోభమ్మ, కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు పాల్గొన్నారు. మాజీ హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, జహంగీర్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన పూజలతో ఎర్రవెల్లిలో కేసీఆర్ నివాసం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

Ktr Dussehra
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

