కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
తుంగభద్ర డ్యాం నుంచి తెలంగాణకు విడుదల చేసిన నీటిని కర్ణాటక తాగునీటి అవసరాల పేరుతో అక్రమంగా మళ్లిస్తోందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
తుంగభద్ర డ్యాం నుంచి తెలంగాణకు విడుదల చేసిన నీటిని కర్ణాటక తాగునీటి అవసరాల పేరుతో అక్రమంగా మళ్లిస్తోందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి, రాష్ట్ర రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు సాగునీరు అందకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించాలని కోరారు.
తెలంగాణ నీటిపారుదల శాఖ అక్టోబర్ 10 నుంచి 24 వరకు 15 రోజుల వ్యవధిలో సుమారు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తుంగభద్ర బోర్డును కోరినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా తొలి ఐదు రోజులు రోజుకు 2,500 క్యూసెక్కులు, తదుపరి ఐదు రోజులు 2,300 క్యూసెక్కులు, చివరి ఐదు రోజులు 2,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.
అయితే, అక్టోబర్ 20 నాటికి ఆర్డీఎస్కు ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో రోజుకు 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే మూడు రోజుల్లోనే ఆర్డీఎస్కు చేరేదని, ఇప్పుడు వారం రోజులు గడిచినా నీరు చేరకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
తుంగభద్ర నుంచి తెలంగాణకు విడుదల చేస్తున్న నీటిని కర్ణాటక ఎగువ ప్రాంతాల్లోనే మళ్లిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై తుంగభద్ర బోర్డు, తెలంగాణ నీటిపారుదల శాఖ తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు.
తెలంగాణకు కేటాయించిన నీరు ఎక్కడ వినియోగమవుతోంది? ఎంత నీటిని విడుదల చేస్తున్నారు? ఆర్డీఎస్ ఆనకట్టకు వాస్తవంగా ఎంత నీరు చేరుతోంది? అనే వివరాలను రోజువారీగా ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్ర అవసరాల కోసం అదనపు నీటిని కోరుకుంటే, అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా నీటిని విడుదల చేసుకోవాలని సూచించారు.
తెలంగాణకు నీటిని విడుదల చేస్తూనే, అదే నీటిని కర్ణాటకలో మళ్లించడం అన్యాయమని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కర్ణాటక వైఖరి ‘నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లు’ ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడతామని చెబుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ మాటలకు, చేతలకు పొంతన లేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని కర్ణాటక ప్రభుత్వంతో చర్చించాలని, తెలంగాణకు రావాల్సిన నీరు సకాలంలో ఆర్డీఎస్కు చేరేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

