Trump Golden Statue | అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ (US Federal Reserve Bank) ఎట్టకేలకు వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. దాదాపు 9 నెలల తర్వాత అంచనాలకు తగ్గట్టుగానే కీలక వడ్డీరేటుకు పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) కోత పెట్టింది. తాజా నిర్ణయంతో ప్రస్తుతం వడ్డీరేట్ల శ్రేణి 4-4.25 శాతంగా ఉన్నది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా క్యాపిటల్ (US Capitol) భవనం వెలుపల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బంగారు విగ్రహాన్ని (Trump Golden Statue) ఏర్పాటు చేశారు. బిట్‌కాయిన్ (Bitcoin) పట్టుకుని ఉన్న 12 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు, ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్లలో ప్రభుత్వ పాత్ర గురించి చర్చించుకునేందుకే ఈ భారీ బంగారు విగ్రహం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహానికి క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు నిధులు సమకూర్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ బంగారు విగ్రహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలావుంటే ఈ ఏడాది మరో రెండుసార్లు వడ్డీరేట్లను ఫెడ్ తగ్గించే వీలుందన్న అంచనాలున్నాయి.
Also Read..
“పావుశాతం వడ్డీరేట్లను తగ్గించిన ఫెడ్ రిజర్వ్”
Pak-Saudi defence pact | పాక్-సౌదీ మధ్య కీలక రక్షణ ఒప్పందం.. భారత్ ఏమన్నదంటే..?