బీజింగ్: రైలు పట్టాల వద్ద పని చేస్తున్న రైల్వే కార్మికులపైకి రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. (Railway Workers Die In china) వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున ‘భూకంప పరికరాల పరీక్ష కోసం ఉపయోగించే’ టెస్టింగ్ ట్రైన్ కున్మింగ్లోని లుయోయాంగ్ టౌన్ స్టేషన్లో ప్రయాణించింది.
కాగా, వంపుగా ఉన్న రైలు పట్టాల వద్ద కొందరు కార్మికులు పని చేస్తున్నారు. అయితే ఆ పట్టాలపై ప్రయాణించిన ఆ రైలు వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది రైల్వే కార్మికులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు చైనాలో దశాబ్దానికి పైగా జరిగిన అత్యంత ఘోర ప్రమాదంగా ఆ దేశ రైల్వే అధికారులు అభివర్ణించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నానికి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.
Also Read:
Hong Kong Fire | హాంకాంగ్‌లో ఏడు భవనాలకు మంటలు.. 44కి పెరిగిన మృతుల సంఖ్య..!
Girl Pushed Into Prostitution By Mother | బాలికను వ్యభిచారంలోకి నెట్టిన.. తల్లి, పొరుగు వ్యక్తి
Watch: పొలంలో రూ.500 నోట్లు నాటిన రైతు.. ఎందుకంటే?