work Permit | టొరంటో, జనవరి 3: కెనడాలో అమలవుతున్న కఠిన వలస నిబంధనలు అక్కడ పనిచేస్తున్న 10 లక్షల మంది భారతీయులకు ముప్పును తెచ్చి పెట్టింది. వలసలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయడంతో కెనడాలో లక్షలాది మంది వలసదారులు వర్క్ పర్మిట్ల ముప్పును ఎదుర్కొంటున్నారు.
వర్క్ పర్మిట్ల గడువు ముగియడం, కఠిన నిబంధనలు, న్యాయపరమైన మార్గాలు తగ్గిపోవడం భారతీయులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేయనుందని ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ కన్వర్ సెయిరా హెచ్చరించారు. 2025 చివరి నాటికి 10.53 లక్షల మంది విదేశీయుల వర్క్ పర్మిట్ల గడువు ముగిసిపోయింది. అలాగే 2026లో 9.27 లక్షల మంది పర్మిట్ల గడువు ముగిసిపోనుంది. వీరిలో ఉద్యోగాలు, చదువు, తాత్కాలిక అవసరాల కోసం వెళ్లిన భారతీయుల సంఖ్యే ఎక్కువగా ఉంది.
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్
Cigarettes | ‘సిగరెట్ల కోసం వియత్నాం ఫ్లైట్ ఎక్కండి’.. ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ పోస్టు వైరల్
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం