Pakistan | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు (terror attack). సార్వత్రిక ఎన్నికలకు మూడురోజుల ముందు పోలీసులే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో సుమారు 10 మంది పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు (cops killed).
డేరా ఇస్మాయిల్ ఖాన్ (Dera Ismail Khan)లోని చోడ్వాన్ పోలీస్ స్టేషన్ (Chodwan Police Station)పై ఉగ్రవాదులు సోమవారం దాడి చేశారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసు స్టేషన్లోకి ప్రవేశించిన ఉగ్రమూకలు.. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు 10 మంది పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించిన తర్వాత హ్యాండ్ గ్రనేడ్లను ఉపయోగించినట్లు స్థానిక అధికారులను ఊటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. దీని వల్లనే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. కాగా, గత కొన్ని రోజులుగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోతున్న విషయం తెలిసిందే.
Also Read..
Byjus | ఎట్టకేలకు ఉద్యోగులకు జీతాలు చెల్లించిన బైజూస్
Sridevi | శ్రీదేవి మృతిపై నకిలీ పత్రాలు.. మహిళపై సీబీఐ ఛార్జిషీట్
Gulmarg | స్కీయింగ్ సిటీపై మంచు దుప్పటి.. డ్రోన్ విజువల్స్