Byjus | గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్ (Byjus) ఎట్టకేలకు తమ ఉద్యోగులకు జనవరి నెల జీతాలు (Salaries) చెల్లించింది. ఈ మేరకు బైజూస్ వ్యవస్థాపకుడు (Byjus founder) రవీంద్రన్ (Raveendran).. ఉద్యోగులకు లేఖ రాశారు. ఎంతగానో పోరాడి ఈ సారి ఉద్యోగులకు జీతాలు చెల్లించినట్లు పేర్కొన్నారు.
‘సోమవారం వరకు వేతనాలు అందుతాయని మీకు సమాచారం ఉంది. అయితే, సోమవారం వరకూ ఎదురుచూడాల్సిన అవసరం లేదు. నేను జీతాలు చెల్లించేందుకు గత కొన్ని నెలలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. మీరు న్యాయంగా చట్టబద్ధమైన వేతనాన్ని పొందేందుకు ఈ సారి నేను మరింత ఎక్కువగా పోరాడాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరూ త్యాగాలు చేశారు. ఎన్నడూ లేనివిధంగా ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ యుద్ధంలో అందరూ అలసిపోయారు. కానీ ఎవరూ వెనకడుగు మాత్రం వేయలేదు. దీనికి కారణం మనం నిర్మించుకున్న దానిపై మనకున్న నమ్మకమే’ అని రవీంద్రన్ తన లేఖలో పేర్కొన్నారు. కష్టసమయంలో కంపెనీకి మద్దతుగా ఉన్నందుకు, జీతాల కోసం ఓపికతో ఎదురుచూసినందుకు ఉద్యోగులకు ఈ సందర్భంగా రవీంద్రన్ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read..
Sridevi | శ్రీదేవి మృతిపై నకిలీ పత్రాలు.. మహిళపై సీబీఐ ఛార్జిషీట్
Gulmarg | స్కీయింగ్ సిటీపై మంచు దుప్పటి.. డ్రోన్ విజువల్స్
Hemant Soren | మరికాసేపట్లో బలపరీక్ష.. భారీ భద్రత మధ్య అసెంబ్లీకి చేరుకున్న హేమంత్ సోరెన్