Hemant Soren | మరికాసేపట్లో బలపరీక్ష.. భారీ భద్రత మధ్య అసెంబ్లీకి చేరుకున్న హేమంత్ సోరెన్
Hemant Soren | జార్ఖండ్‌లో జేఎంఎం (JMM) నేత చంపయీ సొరేన్ (Champai Soren) నేతృత్వంలో ఏర్పాటైన కొత్త సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీలో నేడు బలపరీక్షను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ఈ బలపరీక్షలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మనీలాండరింగ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న హేమంత్ సోరెన్ (Hemant Soren) పాల్గొననున్నారు.
Hemant Soren | జార్ఖండ్‌లో జేఎంఎం (JMM) నేత చంపయీ సొరేన్ (Champai Soren) నేతృత్వంలో ఏర్పాటైన కొత్త సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీలో నేడు బలపరీక్షను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ఈ బలపరీక్షలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మనీలాండరింగ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న హేమంత్ సోరెన్ (Hemant Soren) పాల్గొననున్నారు. శాసనసభలో జరిగే బల పరీక్షలో పాల్గొనేందుకు పీఎంఎల్ఎ కోర్టు నుంచి సోరెన్‌కు అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బలపరీక్షలో ఓటు వేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అసెంబ్లీ (Assembly) వద్దకు చేరుకున్నారు. భారీ భద్రత మధ్య ఈ ఉదయం సోరెన్‌ను అధికారులు అసెంబ్లీకి తీసుకొచ్చారు. మరికాసేపట్లో బలపరీక్ష జరగనుంది.
#WATCH | Former Jharkhand CM Hemant Soren enters State Assembly in Ranchi to participate in the floor test of CM Champai Soren-led government to prove their majority. pic.twitter.com/L0tAqri0LN
— ANI (@ANI) February 5, 2024
మరోవైపు బలపరీక్ష నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న 40 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు సైతం రాంచీ చేరుకున్నారు. బీజేపీ ప్రలోభాల భయంతో గత శుక్రవారం హైదరాబాద్‌కు తరలించిన దాదాపు 40 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు బలపరీక్ష నేపథ్యంలో ఆదివారం తిరిగి రాంచీకి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం జేఎంఎం నేతృత్వంలోని అధికార సంకీర్ణ కూటమికి 46 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. జేఎంఎంకు 28 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 16, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) పార్టీకి ఒక్కరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలకు కలిపి 29 మంది శాసనసభ్యులు ఉన్నారు. అయితే ఇద్దరు జేఎంఎం ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని, వీరు ఓటింగ్‌కు గైర్హాజరయ్యే అవకాశం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది.
Also Read..
Sridevi | శ్రీదేవి మృతిపై నకిలీ పత్రాలు.. మహిళపై సీబీఐ ఛార్జిషీట్
Paytm | లోయర్ సర్క్యూట్‌కు పేటీఎం షేర్.. ఎందుకిలా..?!
Gulmarg | స్కీయింగ్ సిటీపై మంచు దుప్పటి.. డ్రోన్ విజువల్స్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

