Tanzania | న్యూఢిల్లీ : తూర్పు ఆఫ్రికా దేశాలైన టాంజానియా, కెన్యా, బురుండీల్లో కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధాన నదులు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నా రు.
టాంజానియా ప్రధాన మంత్రి కాసిమ్ మజాలివా మాట్లాడుతూ.. పెను గాలులు, వరదల కారణంగా తమ దేశంలో పలు ప్రాంతాలు, పంటలు, వంతెనలు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 155 మంది ప్రాణాలు కోల్పోయారని, సుమారు 236 మంది గాయపడ్డారని చెప్పారు.