Zero Shadow Day | హైదరాబాద్ (Hyderabad) లో మంగళవారం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో నీడ కనిపించని ‘జీరో షాడో డే’ (Zero Shadow day) ఏర్పడింది. ఆ సమయంలో ఎండలో నిటారుగా ( 90 డిగ్రీల కోణం) ఉంచిన ఏ వస్తువు నీడా రెండు నిమిషాల పాటు కనిపించలేదు. 12:12 గంటల నుంచి 12:14 వరకు ఈ అద్భుతం కనిపించింది. ఈ అరుదైన సంఘటనను చూసి నగరవాసులు ప్రత్యేక అనుభూతి చెందారు.
ఇదే విధంగా హైదరాబాద్‌లో ఆగస్టు 3వ తేదీన కూడా ‘జీరో షాడో డే’ ఏర్పడుతుందని బిర్లా సైన్స్ సెంటర్ (Birla Science Centre) టెక్నికల్ అధికారులు తెలిపారు. ఇటీవల బెంగళూరులోనూ ఈ ఖగోళ అద్భుతం కనిపించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 12.17 గంటల సమయంలో రెండు నిమిషాల పాటు ఎండలో ఉన్న వస్తువులు, మనుషుల నీడ మాయమైంది.
Also Read..
Congo floods | కాంగోలో వరద బీభత్సం.. 400 మందికిపైగా మృతి
Asia Cup | పాకిస్థాన్‌కు భారీ షాక్.. చేజారిన ఆసియా కప్ ఆతిథ్యం
AI Pics | ధోనీ టు కోహ్లీ.. మన క్రికెటర్లు అమ్మాయిలైతే ఇలా ఉంటారు..!