Brahmanaidu | హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా గండిపేటలోని సర్వే నంబర్ 18లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు సంబంధించిన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే.
సుమారు రూ.1,500 కోట్ల భూమి కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మనాయుడిని పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. కాగా బ్రహ్మనాయుడిని ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో పోలీసులు బ్రహ్మనాయుడిని చంచల్‌గూడ జైలుకు తరలించినట్టు సమాచారం.
రంగారెడ్డి జిల్లా గండిపేటలోని సర్వే నంబర్ 18లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ రికార్డ్స్‌ను ఫోర్జరీ చేసిన పత్రాలతో కాజేసేందుకు కుట్ర చేశారంటూ తహసీల్దార్ చేసిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Good news | వైద్య నిపుణులకు గుడ్ న్యూస్.. తిరుమలలో ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవలు ప్రారంభం
ప్రజల భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర