హైదరాబాద్ : లోన్ యాప్(Loan App) వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. కుత్బు ల్లాపూర్ నియోజకవర్గంలోని సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన విద్యార్థి భాను ప్రకాష్ (22) ఆరోరా కళాశా లలో మాస్టర్స్ చదువుతున్నాడు. ఇటీవల కాలం నుంచి లోన్ యాప్ వేధింపుల తాళ లేక మదన పడుతున్న భాను, నిన్న సాయంత్రం ఫాక్స్ సాగర్ చెరువులో(Fox Sagar pond) దూకి ఆత్మహత్యకు(Commits suicide) పాల్పడ్డాడు. అతడి స్నేహితులు
మొబైల్ లొకేషన్ ద్వారా ఆచూకీ తెలుసుకొని చెరువు వద్దకు వెళ్లి చూడగా అతని దుస్తులు, వాహనం గట్టుపై ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read..