హైదరాబాద్ : స్నేహితులతో సరదగా గడిపేందుకు చెరువు వద్దకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో పడి గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పూజారి భరత్ చంద్ర అనే వ్యక్తి తోటి స్నేహితులతో కలిసి రంగారెడ్డి జిల్లా(Rangareddy) ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువు(Ibrahimpatnam pond) వద్దకు వెళ్లాడు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతయ్యాడు(Man drowned). గమనించిన స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.