హైదరాబాద్ : రాజేంద్రనగర్(Rajendranagar)లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్(Electric shock)తో సలీమ్ అనే కార్మికుడు మృతి(Worker died) చెందాడు. ఉప్పరపల్లిలోని(Upparapalli) ఓ ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ సరఫరా అవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. గుర్తించిన స్థానికులు హుటాహుటిన దవాఖానకు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ సలీం మృతి చెందాడు. సలీం మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.