తెలంగాణ ప్రభుత్వం ఆమెకు అందలం వేసింది. మహిళల ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి ఆర్థిక భరోసా కల్పించారు. మహిళల సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళల కోసం సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నంబర్‌ను సరూర్‌నగర్ స్టేడియంలో మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు. హైదర్‌గూడలో హోంమంత్రి మహమూద్ అలీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించారు. మేడ్చల్, పీర్జాదిగూడ, వెస్ట్‌మారేడ్‌పల్లిలో ప్రతిభ కనబర్చిన మహిళా ఉద్యోగులకు మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశంసా పత్రాలు అందించి సన్మానించారు. రవీంద్రభారతిలో జరిగిన మహిళా సంక్షేమ దినోత్సవంలో మంత్రులు సత్యవతిరాథోడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
మారేడ్‌పల్లి, జూన్ 13 : మహిళల అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వెస్ట్‌మారేడ్‌పల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ వారి అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు.
వైద్య రంగంలో ఆశ వర్కర్లు, గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల సంరక్షణలో అంగన్వాడీ టీచర్లు అందిస్తున్న సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో, స్థానిక సంస్థలు, చట్ట సభలలో అవకాశాలు కల్పిస్తూ వారి హక్కులను కాపాడుతున్నట్లు చెప్పారు. తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు, పాలు, బాలామృతం వంటి పౌష్టికాహారం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్టు అధికారి సునంద, నోడల్ అధికారి రాజేందర్, కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, బేగంపేట డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి, సఖి కేంద్రం అధికారి అనితారెడ్డి, యూసీడీ ప్రాజెక్టు ఆఫీసర్ నీరజ, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, పీర్జాదిగూడలో మంగళవారం జరిగిన మహిళా సంక్షేమ దినోత్సవ సంబురాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళాలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దుక్కుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మహిళలకు కల్పించిన రిజర్వేషన్లతో వచ్చే జమనా అంతా మహిళలదేనని చెప్పారు. ఆడబిడ్డల సంక్షేమంలో తెలంగాణలో ఎదురులేదని, మహిళా సాధికారతలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉందని మంత్రి చెప్పారు. మహిళలలను ఆర్థికంగా ఎదిగేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
మహిళలకు సీఎం కేసీఆర్ అన్నీతానై పెద్ద కొడుకులా, మేనమామ, అన్నగా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మనసున్న కేసీఆర్ రాష్ర్టానికి ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణ ప్రజల అదృష్ణం అని చెప్పారు. మహిళందరూ ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఖాళీగా ఉండకుండ ఎదో ఒక పని చేస్తే ఆర్థిక విజయం సాధిస్తారని, టీవీలు, ఫోన్లు చూస్తూ సమయం వృథా చేయవద్దని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, జడ్పీ సీఈవో దేవసహాయం, ఆర్డీవో రవి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపిక నర్సింహారెడ్డి, ఎంపీపీలు రజిత రాజామల్లారెడ్డి, ఎల్లుబాయి, హారిక మురళిగౌడ్, జడ్పీటీసీ శైలజ విజయేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
హిమాయత్‌నగర్, జూన్13 : మహిళల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. దేశంలో సీఎం కేసీఆర్ లాంటి నాయకుడే లేడని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం హైదర్‌గూడలోని ఎంఏ గార్డెన్లో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుందని, అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. మహిళల ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే విపక్షాల తీరు మాత్రం కొత్త బిచ్చగాళ్ల మాదిరిగా ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అనంతరం నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలకు సంబంధించిన 4కోట్ల రూపాయాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర కేంద్ర గ్రంథాలయ చైర్మన్ ప్రసన్న రామ్మూరి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్స్ మోహన్‌రెడ్డి, రజినీకాంత్, డీపీవోలు రజితారెడ్డి, దామోదర్‌రెడ్డి, బాలసృజన్, హిమాయత్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు యాదగిరిసుతారి, బంజారాహిల్స్ డివిజన్ మామిడి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పహాడీషరీఫ్, జూన్ 13 : మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పహాడీషరీఫ్ ప్రీమియర్ ఫంక్షన్హాల్లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మజ కుమారితో కలిసి జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితులు ఎట్లా ఉండేవో, ఇప్పుడు ఎట్లా ఉన్నాయో బేరీజు వేసుకోవాలన్నారు. ఇంటి ఆడబిడ్డ సంతోషంగా ఉన్నప్పుడే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని సీఎం కేసీఆర్ మహిళల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.
గర్భిణు ల్లో రక్తహీనత సమస్య తొలగించటానికి న్యూట్రిషన్ కిట్లు ఇస్తున్నామన్నారు. అశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్ల సేవలు ఎంతో గొప్పవని, వారు సమాజంలో అమ్మ పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. షీ టీంలతో మహిళకు భరోసా లభించిందన్నారు. అనంతరం 137 మందికి షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన మహిళలకు ప్రశంశ పత్రాలు అందించి సన్మానం చేశారు. మహిళా సంఘాలకు రుణాల చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఆర్డీవో సూరజ్‌కుమార్, బాలాపూర్ తహసిల్దార్ జనార్ధన్‌రావు, మహేశ్వరం ఎంపీడీవో నర్సింహ, జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, వైస్ చైర్మన్ పర్హనా నాజ్, కమిషనర్లు, నాగేశ్వర్రావు, వసంత, డీఈ వెంకన్న, ఏఈ ఆయేషా, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, కౌన్సిలర్లు జింకల రాధిక శ్రవణ్, షేక్ పహిదా బేగం, శంషోద్దీన్, కెంచె లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ నాయకులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, సూరెడ్డి కృష్ణారెడ్డి, యూసుఫ్ పటేల్, యంజాల జనార్దన్, షేక్ అప్జల్, యంజాల అర్జున్, బర్కత్ అలీ, మన్నన్, సోషల్ మీడియా కన్వినర్ వాసుబాబు తదితరులు పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా సాధికారిక దినోత్సవం సందర్భంగా జీఆర్కే గార్డెన్లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. అంతకుముందు ఎంపీ రంజిత్‌రెడ్డి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళా గ్రూప్ సభ్యులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహేందర్‌గౌడ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
-బండ్లగూడ, జూన్ 13