Rapido bike | ఓ మహిళ తన సెల్‌ఫోన్ రిపేర్ చేయించడం కోసం అమీర్ పేట్ వెళ్లేందుకు ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. అయితే ఆ మహిళ వెళ్తున్న ర్యాపిడో బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో సదరు మహిళ అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోగా.. డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం అమీర్ పేట్లో చోటుచేసుకుంది.
ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన హేమదుర్గ అనే మహిళ బంజారాహిల్స్‌లోని ఓ కారు కంపెనీలో పనిచేస్తోంది. హేమదుర్గ తన సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు రాపిడో బైక్‌పై అమీర్‌పేట్ వెళ్లే క్రమంలో అమీర్‌పేట్- శ్రీనగర్ కాలనీలోని బిగ్ బజార్ వెనుక గేట్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న రాపిడో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హేమదుర్గ బస్సు టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. రాపిడో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసుల ర్యాపిడో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అమీర్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
ఆర్టీసీ బస్సు కింద పడి ఏపీకి చెందిన మహిళ మృతి
బంజారాహిల్స్‌లోని ఓ కారు కంపెనీలో పనిచేస్తూ తన సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు రాపిడో బైక్‌పై అమీర్‌పేట్ వెళ్లిన భీమవరం ప్రాంతానికి చెందిన హేమదుర్గ అనే మహిళ
అమీర్‌పేట్ శ్రీనగర్ కాలనీలోని బిగ్… pic.twitter.com/GtWYC99cm1
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2026
Brahmotsavams | ఏపీ సీఎంకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత