శాంతియుత పోరాటాల ద్వారా సామాజిక మార్పు సాధించడమే గాంధీజీ ఆశయం: కేసీఆర్
మహాత్మాగాంధీ అనుసరించిన ప్రజాస్వామిక శాంతియుత పోరాట కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తనకు స్ఫూర్తిగా నిలిచిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.
మహాత్మాగాంధీ అనుసరించిన ప్రజాస్వామిక శాంతియుత పోరాట కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తనకు స్ఫూర్తిగా నిలిచిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ప్రజాస్వామిక హక్కుల సాధనకోసం గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహ పంథా నేటి యువతరానికీ ఆచరణీయమన్నారు. గాంధీ జయంతి సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం వారి త్యాగనిరతని స్మరించుకుంటూ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.
న్యాయమైన ప్రజల ఆకాంక్షల కోసం, నిరంకుశ ప్రభుత్వాల మీద పోరాడే నాయకత్వం, విశాల దృక్పథంతో తమ పోరాట కార్యాచరణను రూపొందించుకోవాలనే తాత్వికతను గాంధీజీ జీవితం నుంచి నేర్చుకోవాల్సి ఉన్నదని కేసీఆర్ అన్నారు. పీడితులందరినీ సమన్వయం చేసుకుంటూ, భావజాల వ్యాప్తిని చేస్తూ, శాంతియుత పోరాటంలో భిన్న వర్గాలను ఐక్యసంఘటన శక్తిగా తీర్చిదిద్దుకోవాలనే గాంధీజీ ఆశయాలను ప్రతీ ఒక్కరు అనుసరించాలన్నారు.
తెలంగాణ సాధన కోసం తాను ఒంటరిగా ముందడుగు వేసిన నాటినుంచి నేటి వరకు ఎన్ని కష్టాలొచ్చినా తాను స్థిత ప్రజ్జతతో అనుసరిస్తున్న కార్యాచరణలో గాంధీజీ స్పూర్తి ఇమిడి ఉన్నదని కేసీఆర్ స్పష్టం చేశారు. విద్వేష పూరిత ప్రసంగాలను, కక్షపూరిత వైఖరులను విడనాడి, ప్రజల నడుమ శాంతి సౌభ్రాతృత్వం పరిఢవిల్లేలా పాలనను కొనసాగించడం ద్వారా మాత్రమే జాతిపిత మహాత్మాగాంధీకి మనం నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
Diabetes | వయసుతోపాటు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వస్తాయా? పోషకాహార నిపుణుల కీలక హెచ్చరిక..
తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ వివరాలు ఆంధ్రాకు లీక్?.. 15 మంది అధికారులను తొలగించిన సీఎం విజయ్
AP News | ఏపీలో 58 ఎంపీపీ స్థానాల్లో ఎన్నికలు పెండింగ్..!
AP News | బొత్స ఇలాకాలో వైసీపీకి ఘోర పరాజయం.. కేవలం ఒక్క ఎంపీపీ స్థానమే దక్కిన వైనం..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

