Putin: ఉక్రెయిన్ వార్‌ను ఆపే మంచి ఆలోచనలు మోదీ వద్ద ఉన్నాయి: పుతిన్
Putin: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించే అంశంపై ప్రధాని మోదీ వద్ద మంచి ఐడియాలు ఉన్నాయంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఉమ్మడి అంగీకారం ద్వారా యుద్ధాన్ని ఆపే ఐడియాలు మోదీ వద్ద ఉన్నట్లు పుతిన్ తెలిపారు. తనతో భేటీ అయిన ప్రతిసారి యుద్ధాన్ని ఆపే అంశం గురించి ఆయన చర్చిస్తుంటారని పుతిన్ పేర్కొన్నారు.
మాస్కో: ప్రధాని మోదీని పుతిన్(Putin) ప్రశంసించారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించే అంశంపై ప్రధాని మోదీ వద్ద మంచి ఐడియాలు ఉన్నాయంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఉమ్మడి అంగీకారం ద్వారా యుద్ధాన్ని ఆపే ఐడియాలు మోదీ వద్ద ఉన్నట్లు పుతిన్ తెలిపారు.తనతో భేటీ అయిన ప్రతిసారి యుద్ధాన్ని ఆపే అంశం గురించి ఆయన చర్చిస్తుంటారని పుతిన్ పేర్కొన్నారు. వల్దాయి ఇంటర్నేషనల్ డిస్కషన్ క్లబ్ మీటింగ్ సమయంలో పుతిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలను ఆపడంలో మోదీ వ్యూహాం ప్రత్యేకమైందని, ప్రపంచ నేతల్లో ఆయన ఒకరు అని, ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయని, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని, వ్యక్తిగతంగానూ మంచి రిలేషన్ ఉందని, ఎక్కడ కలిసినా ప్రతిసారి ఉక్రెయిన్ యుద్ధం ముగింపు గురించి అడుగుతుంటారని పుతిన్ అన్నారు.
ఉమ్మడిగా అంగీకరం కుదుర్చుకునే ఐడియాలు ఆయన వద్ద చాలా ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సమయంలోనూ ఉక్రెయిన్ వార్ గురించి మోదీ అడిగారన్నారు. ఇండియా చేపట్టే శాంతి ప్రయత్నాలను స్వాగతిస్తామని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పిస్కోవ్ తెలిపారు. చర్చలు, దౌత్యంతో ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించాలని భారత్ చేస్తున్న సూచనలను తాము కూడా అంగీకరిస్తున్నట్లు దిమిత్రీ వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Kumar Goud | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలను పరిశీలిస్తాం : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Cyclone Akvan | దూసుకొస్తున్న తీవ్ర తుఫాను అక్వాన్.. శుక్రవారం తీరాన్ని దాటే ఛాన్స్..!
Tirumala | తిరుమలలో తగ్గిన రద్దీ..హుండీ ఆదాయం రూ.4.55 కోట్లు
రామాంజనేయ కాలనీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
Cyclone Akvan | అక్వాన్ తుపాను ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. పూరీ తీరం వెంట ఎర్ర జెండాలు.. Video
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

