హైదరాబాద్: హైదరాబాద్ కూటక్‌పల్లి హౌసింగ్‌బోర్డులో (KPHB) దారుణం చోటుచేసుకున్నది. భర్తపై విరక్తితో కరెంట్ షాక్‌తో చంపిన భార్య.. అతని మృతదేహాన్ని పూడ్చిపెట్టి గ్రామానికి వెళ్లిపోయింది. సాయిలు, కవిత దంపతులు కూకట్పల్లి హౌసింగ్‌బోర్డులో గత కొన్నాళ్లుగా నివాసం ఉంటున్నారు. గత 15 ఏండ్లుగా దంపతులిద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. భార్య, భర్త ఇద్దరికీ వేరువేరుగా వివాహేతర సంబంధాలు ఉన్నాయి.
దీంతో కొన్నాళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు. తరచూ ఆమె ఇంటికి వెళ్లి వేధించసాగాడు. దీంతో విసిగిపోయిన కవిత.. తన చెల్లిలి భర్తతో కలిసి సాయిలుకు కరెంట్ షాక్ పెట్టి చంపేసింది. అనంతరం శవాన్ని పాతిపెట్టి సొంతూరుకు వెళ్లిపోయింది. అయితే సాయిలు ఎందుకు రాలేదని కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో.. పనికి వెళ్లి తిరిగి రాలేదని తెలిపింది. దీంతో కవితపై అనుమానంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు విషయం వెలుగుచూసింది.