సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో జనం ఎండ వేడిమికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.7డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలు, గాలిలో తేమ 25శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా రాగల రెండు రోజుల్లో గ్రేటర్‌కు వర్షసూచన ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.