Murder | మూసాపేట, ఫిబ్రవరి 11 : అనుమానమే పెనుభూతమైంది.. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.
కూకట్పల్లి పీఎస్ సీఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట్ పరిధిలోని హబీబ్‌నగర్‌లో నివాసం ఉంటున్న రహీం, నస్రీన్(22) కు ఆరేండ్ల క్రితం పెళ్లైంది. ఈ దంపతులరకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే రహీం నాంపల్లి కేర్ హాస్పిటల్లో వార్డ్ బాయ్‌గా పని చేస్తున్నాడు. భార్య మీద అనుమానంతో రహీం ఆమెతో తరచుగా గొడవపడేవాడు.
మంగళవారం ఉదయం హబీబ్ నగర్ నుంచి రాజీవ్ గాంధీ నగర్‌కు ఇల్లు షిఫ్ట్ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో రహీం ఉన్మాదిగా మారి భార్య నస్రీన్ తలపై బండరాయితో మోది హత్య చేసి పరారయ్యాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.