బొల్లారం, మే 31: ఏడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భర్త కండ్లముందే కొందరు గుర్తు తెలియని దుండగులు అతడి భార్యను బలవంతంగా లాకెళ్లి గొంతు కోసి కిరాతకంగా హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్, మీనా దేవి (35) దంపతులు బతుకు తెరువు కోసం బొల్లారం పారిశ్రామిక వాడకు వలస వచ్చి స్థానిక వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి దంపతులిద్దరూ సమీపంలోని వారాంతపు సంతకు వెళ్లారు.
రాత్రి తమ బైక్ పై తిరిగి ఇంటికి వస్తున్నారు. వారి బైక్ …
గండిగూడెం క్రీడా ప్రాంగణం సమీపానికి రాగానే ఆగిపోయింది. బైక్ను పరిశీలిస్తున్న సమయంలో రోడ్డు పకనే ఉన్న చెట్ల పొదల్లోంచి కొందరు దుండగులు ఒకసారిగా వారిపై దాడి చేశారు. మొదట భర్త అనిల్ కుమార్ను చితకబాదిన దుండగులు, ఆ తర్వాత మీనాదేవిని పొదల్లోకి లాకెళ్లారు. అనిల్ కుమార్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం దుండగులు మీనాదేవి గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసి అకడి నుంచి పారిపోయారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.