Minister Ponnam Prabhakar | ఆర్టీసీ భూముల్లో ఇందిరమ్మ ఇండ్లు కడితే తప్పేంటి..? : మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar | తెలంగాణలో ఉండి విభజన చట్టం ఇంకేముంది.. ఆర్టీసీ వందల ఎకరాలు తీసుకుంటున్నపుడు ప్రభుత్వం అడిగితే 5-10 ఎకరాలు ఇవ్వొద్దా..? అందులో తప్పేముందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
Minister Ponnam Prabhakar | ఆర్టీసీ భూముల్లో ఇందిరమ్మ ఇండ్లు కడితే తప్పేంటి..? మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీడియా సమావేశంలో ఆర్టీసీ స్థలాల విషయంలో గందరగోళం ఉంది.. విభజన చట్టాన్ని వ్యతిరేకించి ఇందిరమ్మ ఇండ్లకు ఇస్తున్నారని ఓ రిపోర్టర్ మంత్రి పొన్నంను ప్రశ్నించాడు. దీనికి మంత్రి పొన్నం స్పందిస్తూ.. తెలంగాణలో ఉండి విభజన చట్టం ఇంకేముంది.. ఆర్టీసీ వందల ఎకరాలు తీసుకుంటున్నపుడు ప్రభుత్వం అడిగితే 5-10 ఎకరాలు ఇవ్వొద్దా..? అందులో తప్పేముందన్నారు.
మేం ప్రభుత్వం తరపున కొత్త టర్మినల్స్ కోసమో లేదంటే అనేక సందర్భాల్లో తీసుకుంటున్నం. ఇవన్నీ స్థలాలు ప్రభుత్వాలవే.. ఆర్టీసీ వేరే కాదు..? ఆర్టీసీ కూడా ప్రభుత్వమేనన్నారు. మేం గతంలో ఉపాధి ఒక దగ్గర, ఇల్లు ఒక దగ్గర వాడు పోతలేడని చెప్పి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి రివ్యూ పెట్టుకొని తీసుకున్నం. దాంట్లో ఎక్కడా పొరపాటు లేదు.. ఆర్టీసీ తరపున మేం వందల ఎకరాలు ప్రభుత్వం తరపున తీసుకుంటున్నం. అందుకు సంబంధించి ఎలాంటి సమస్య లేని స్థలాన్ని ఇస్తున్నం.
అది కూడా పేదల ఇండ్లకు దీని మీద ఏమన్నా డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే మార్చుకోవాలని కోరుతున్నానన్నారు. ఎందుకంటే కొంతమంది దాని మీద ఊరికే రాద్దాంతం చేసే ప్రయత్నం చేస్తున్నరు. వాళ్లు ఆంధ్రాకు బెనిఫిట్ చేయాలని చూస్తున్నరా..? ఏమో తెలియదు.. కానీ ఏం పేదలు ఇల్లు కట్టుకుంటే తప్పేముందంటూ చెప్పుకొచ్చారు.
Read Also :
Tirumala | సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
New York: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కత్తులతో మహిళ దాడి.. వీడియో
Biceps | పెద్ద బైసెప్స్ కావాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే.. ఇలా చేయండి..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

