Russia | ఉక్రెయిన్‌పై డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా దాడులు.. 12 మంది మృతి.. మృతుల్లో ఒక భారతీయుడు
Russia : ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడికి దిగింది. రాజధాని కీవ్‌తోపాటు ఒడెశాపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 12 మంది మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఒక భారతీయుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Russia : రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడికి దిగింది. రాజధాని కీవ్‌తోపాటు ఒడెశాపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 12 మంది మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఒక భారతీయుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా దాడులపై ఉక్రెయిన్ ప్రకటన చేసింది. దీని ప్రకారం.. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు ఉక్రెయిన్‌లోని 28 స్థావరాలపై రష్యా దాడి చేసింది. 200 వరకు డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది. కీవ్‌తోపాటు ఒడెశా ప్రాంతంపై బాలిస్టిక్ మిస్సైల్స్, క్రూయిజ్ మిస్సైల్స్, యాంటీ రాడార్ మిస్సైళ్లతో దాడికి పాల్పడింది. ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో 12 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పిల్లలు కూడా ఉన్నారు. జనావాసాలపై ఈ దాడులు జరిగాయి. అనేక ఇండ్లు, అపార్ట్మెంట్లు ధ్వంసమయ్యాయి.
దాడి అనంతరం ధ్వంసమైన నివాసాల నుంచి అధికారులు ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ స్థాయిలో సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ దాడుల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్‌కు సాయం అందించేందుకు యురోపియన్ యూనియన్ సిద్ధమైంది. ఆర్థిక సాయంతోపాటు 104 బిలియన్ డాలర్ల అప్పు ఇచ్చేందుకు కూడా ఈయూ ప్రయత్నిస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

