బూర్గంపహాడ్, సెప్టెంబరు 01 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక బ్రిలియంట్ నవోదయ కోచింగ్ ఆధ్వర్యంలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష 2027-28 సంవత్సరానికి సంబంధించి నూతన సిలబస్ విధానంలో జిల్లా స్థాయిలో నూతన సిలబస్‌పై మోడల్ ప్రవేశ పరీక్ష ఈ నెల 6న నిర్వహించనున్నట్లు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బీఎన్ఆర్ మంగళవారం తెలిపారు. జవహర్ విద్యాలయ సమితిలో కేంద్రం ఈ ఏడాది నవోదయ సిలబస్‌లో స్వల్ప మార్పులు చేసిన నేపథ్యంలో, విద్యార్థులకు కొత్త సిలబస్ పరీక్ష విధానంపై అవగాహన కల్పించేందుకు ఈ పరీక్ష ఉపయోగడుతుందన్నారు. 6వ తేదీ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ జరుగుతుందన్నారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న ఇంగ్లీష్, తెలుగు మీడియం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 100 మార్కులకు మెంటల్ ఎబిలిటీ 20, ఎన్విరాన్మెంట్ 20, మ్యాథ్స్ 20, లాంగ్వేజ్ టెస్ట్ 20 మార్కుల చొప్పున ఓఎంఆర్ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని వెల్లడించారు.