Duleep Trophy : దేశవాళీ సీజన్లో మొదటిదైన దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్(East Zone) ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆల్‌రౌండ్ షోతో దుమ్మురేపిన ఈస్ట్ డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్(Central Zone)పై గెలుపొందింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(40), కెప్టెన్ ఇషాన్ కిషన్(39)ల బ్యాటింగ్ మెరుపులకు.. పేసర్ ముకేశ్ కుమార్(3-56, 4-44) విజృంభణ తోడవ్వగా సెమీ ఫైనల్లో సౌత్ చతికిలపడింది. ఐపీఎల్లో డబుల్ ట్రోఫీలతో మెరిసిన రజత్ పాటిదార్‌పై ఇషాన్ బృందం పైచేయి సాధించగా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఈస్ట్ టైటిల్ పోరుకు సిద్ధమైంది.
ఐపీఎల్లో వరసగా రెండుసార్లు ఆర్సీబీని విజేతగా నిలిపిన రజత్ పాటిదారి దేశవాళీలో మాత్రం విఫలమయ్యాడు. నిరుడు దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్‌కు ట్రోఫీ కట్టబెట్టిన అతడు.. ఈసారి అదే ఫలితాన్ని సాధించలేకపోయాడు. దాంతో.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరిగిన సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు సౌత్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది.
East Zone completes a 4-wicket win to knock out the defending champions Central Zone and book a spot for themselves in the Duleep Trophy final 🙌#DuleepTrophy pic.twitter.com/lSW6ttURpg
— Circle of Cricket (@circleofcricket) September 1, 2026
రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి నిర్దేశించిన స్వల్ప ఛేదనలో ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(24), వైభవ్ సూర్యవంశీ(40)లు శుభారంభమివ్వగా మిడిలార్డర్ బ్యాటర్లు రాణించారు. గాయంతో రెండో రోజు ఆటకు దూరమైన కెప్టెన్ ఇషాన్ కిషన్(39) దంచేశాడు. దాంతో.. సౌత్‌పై 4 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది ఈస్ట్.
East Zone are into the final 👏
Mohd. Shami hits the winning runs 👌
They beat defending champions Central Zone by 4⃣ wickets 🙌#DuleepTrophy | #CZvEZ
Scorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/yzYIVMctVH
— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026
తొలి ఇన్నింగ్స్‌లో రింకూ సింగ్(60) రాణించినా 266 పరుగులకే సౌత్ జోన్ ఆలౌటైంది. అనంతరం హర్ష్ దూబే(4-66), ఆర్యన్ పాండే(3-43)ల విజృంభణతో ఈస్ట్ జోన్ సైతం అన్నే పరుగులకు కుప్పకూలింది. కానీ, రెండో ఇన్నింగ్స్‌లోనైనా భారీ స్కోర్ కొట్టాలనుకున్న సౌత్‌ను అభిజిత్ సర్కార్(3-38), ముకేశ్ కుమార్(3-56)లు దెబ్బకొట్టారు. దాంతో, రజత్ పటిదార్ సేన 158 రన్స్‌కే పరిమితమైంది.
Harsh Dubey bagged a 4-wicket haul in each innings of the Duleep Trophy semi-final against East Zone.#DuleepTrophy pic.twitter.com/mX9mLDUL6Z
— Circle of Cricket (@circleofcricket) September 1, 2026
అనంతరం 159 పరుగుల స్వల్ప ఛేదనలో ఈస్ట్ ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(24), వైభవ్ సూర్యవంశీ(40)లు ధనాధన్ ఆడారు. మళ్లీ దూబే(4-53) తిప్పేసినా.. ఇషాన్ కిషన్(39) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దూబే నాలుగు వికెట్లు తీసినా.. షమీ విన్నింగ్ షాట్ కొట్టగా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంటిదారి పట్టింది.