BOI Jobs | బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 205 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
BOI Jobs | బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారి నుంచి దరఖాస్తులు కోరుతుంది.
BOI Jobs | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రముఖ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) 205 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా వివిధ విభాగాల్లో స్కేల్ 4 స్థాయి వరకు ఆఫీసర్ పోస్టులను నింపనుంది. 205 ఖాళీలను స్కేల్ 1 ఆఫీసర్ నుంచి స్కేల్ 4 ఆఫీసర్ స్థాయి వరకు ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఆర్హులైనవారు సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 25లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీలు
చీఫ్ మేనేజర్ 10, సీనియర్ మేనేజర్ 49, మేనేజర్ 118, ఆఫీసర్ 28 ఖాళీలు ఉన్నాయి. వీటిని ఫుల్‌స్టాక్ ఇంజినీరింగ్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, డేటా ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, లా, సివిల్ ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో నింపనున్నారు.

Posts Boi
అర్హతలు
సంబంధిత విభాగాల్లో డిగ్రీ, బీఈ, బీటెక్, లా, ఎంసీఏ, ఎమ్మెస్సీ, పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 ఏండ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయసు పోస్టును బట్టి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ. 1180, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ. 175.
ఎంపిక
ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ (Interview) ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ. 48,480-1,20,940 వరకు జీతం ఉంటుంది.
చివరితేదీ
ఆన్లైన్లో చేసుకునే దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 10 నుం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 25 వరకు కొనసాగుతుంది. ఇతర వివరాలకు వెబ్సైట్ www.bankofindia.bank.inలో చూడండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్‌లు
Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

