గోల్నాక, మార్చి 13: ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మరో వైపు అంబర్‌పేట నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధిని చూసి బీజేపీతో పాటు ఇతర పార్టీల నాయకులు, యువత బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం అంబర్‌పేట డివిజన్ పటేల్‌నగర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు రావుల ప్రవీణ్‌పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రఘునాథ్నగర్కు చెందిన పలు యువజన సంఘాల యువత బీఆర్ఎస్లో పార్టీలో చేరారు. వీరికి అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్దార్థ్ముదిరాజ్తో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో గత పదిహేనేండ్లుగా అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గం కేవలం మూడేండ్ల వ్యవధిలో అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో నాయకులు శ్రీకాంత్, వెంకటేశ్, ప్రణయ్, రత్న, గణేశ్, కుమార్., యాదయ్య, భిక్షపతి, మహేశ్, చందు, జంగయ్య, లక్ష్మయ్య, నందు, హరీశ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎర్రబోలు నరసింహరెడ్డి, కె.రామారావుయాదవ్, రాజగోపాల్‌నాయుడు, పి.శ్రవణ్‌కుమార్, బేగం, భాషా, మహ్మద్ అతిక్, సలీం, లత, శ్యామ్, సందీప్, రాము, రఘు, మహ్మద్‌గౌస్, ఎండీ జాఫర్, నాగేశ్, రాజ్‌కుమార్, మహ్మద్ అయ్యాస్, రవి, మహేశ్సాయి, సురేశ్, చింటూ, తదితరులు పాల్గొన్నారు.
కిషన్‌రెడ్డి ఒరగబెట్టింది ఏమీలేదు.!
మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి, దాదాపు మూడేండ్లుగా కేంద్రమంత్రిగా కొనసాగుతున్న జి.కిషన్‌రెడ్డి నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమీలేదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విమర్శించారు. కేంద్రమంత్రిగా ప్రస్తుతం రూ.20 కోట్ల ఎంపీ నిధులున్నా నియోజకవర్గానికి పైసా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. ఇక జి.కిషన్‌రెడ్డిని నియోజకవర్గం ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.