MD Nagireddy | రోడ్ సేఫ్టీ మంత్ జనవరి 1న (ఈ రోజే) ప్రారంభించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సంకల్పం తీసుకున్నారని టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.
అందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు తెలంగాణ ఆర్టీసీ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కార్యక్రమం ప్రారంభిస్తుందన్నారు.
ఆర్టీసీ ప్రతి రోజు 10 వేల బస్సులు నడుపుతుందన్నారు. 60 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. 39 వేల మంది ఆర్టీసీ, 6 వేల మంది తాత్కాలిక సిబ్బంది పని చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం 600 ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు తగ్గించడానికి ప్రతి డిపోలో డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం , బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయడం జరుగుతుందన్నారు ఎండీ నాగిరెడ్డి.
ప్రతీ సంవత్సరం రూ.80 కోట్లు ప్రమాద బీమా.. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలు శాశ్వత వికలాంగులు అయిన వారి కుటుంబాలు జీవితాంతం ఇబ్బందులు పడుతున్నాయి. ప్రతీ సంవత్సరం రూ.80 కోట్లు ప్రమాద బీమా చెల్లించడం జరుగుతుంది. ప్రమాదాలు డిపో స్థాయిలోనే పరిష్కారం చేస్తున్నాం. ఆర్టీసీ ప్రమాదాలు జీరో స్థాయికి తీసుకొస్తామని ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు.
రోడ్డు భద్రత మనకి జీవ నాడి..ఆర్టీసీలో లక్ష కిలోమీటర్లకు 0.07 శాతం మాత్రమే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.దేశంలోనే తక్కువ ప్రమాదాలు జరుగుతున్న సంస్థ టీజీఎస్ఆర్టీసీ అన్నారు. డ్రైవింగ్ మెళుకువలు జాగ్రత్తగా నేర్చుకోవడం ,బస్ ప్రారంభం అయ్యే ముందు బ్రీత్ టెస్ట్ చేస్తున్నాం. కొంత టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తున్నాం. ఫాగ్ ఉన్న సమయంలో,వర్షం కురుస్తున్న సమయంలో సిమ్యులేటర్ ద్వారా చేస్తాం. ప్రతీ జోన్‌కు రెండు సిమ్యులేటర్స్ వస్తున్నాయి. ప్రతి డిపోలో డ్రైవర్లకు రెస్ట్ తీసుకోవడానికి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం జీరో ప్రమాదాలు లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
Air India | విమానం టేకాఫ్‌కు ముందు పైలట్ వద్ద మద్యం వాసన.. అరెస్ట్