గురువారం 29 అక్టోబర్ 2020
Hyderabad - Sep 20, 2020 , 01:41:47

బాధితులకు అండగా నిలుస్తాం

బాధితులకు అండగా నిలుస్తాం

ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి 

 ఉప్పల్‌ : అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే అందజేశారు. నా చారానికి చెందిన లలితమ్మకు రూ.60 వేల చెక్కును అందజేసి, యోగాక్షేమాలు తెలుసుకున్నారు. డివిజన్‌ అధ్యక్షుడు మేడల మల్లికార్జున్‌గౌడ్‌, గోపాల్‌రెడ్డి, సుధాకర్‌, కృష్ణారెడ్డి, వీరేశ్‌, వినీష్‌రెడ్డి, సాయిరాజ్‌ పాల్గొన్నారు. 

 ఎల్బీనగర్‌ : చైతన్యపురి డివిజన్‌లోని సాయినగర్‌ కాలనీకి చెందిన తిరుమలయ్యకు మంజూరైన సీఎం సహాయ నిధి రూ. 60వేల చెక్కును కార్పొరేటర్‌ విఠల్‌రెడ్డి అందజేశారు. 


logo