సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ) : సింగూరు నుంచి హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న 1200 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్‌కు ఖానాపూర్ వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టేందుకు ఈ నెల 7వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 8వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల వరకు మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. దీంతో 24 గంటల పాటు సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు ఉన్న రిజర్వాయర్ పరిధి ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు.
షేక్‌పేట, టౌలీచౌకి, గోల్కొండ, భోజగుట్ట రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు, గండిపేట్, కోకాపేట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, ఖానాపూర్, నెక్నంపూర్, మంచిరేవుల ప్రాంతాలలో నీటి సరఫరా అంతరాయం ఏర్పడుతుందని, ఈ 24 గంటల స్వల్ప అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.