Water ATM | కొండాపూర్, ఏప్రిల్ 8 : ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎనీ టైం వాటర్ అందించేలా ఏర్పాటుచేసిన వాటర్ ఏటీఎం మూతపడింది. చందానగర్ సర్కిల్ -21 కార్యాలయానికి ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్డులో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎం నిర్వహణను గాలికి వదిలేశారు. వేసవి ఎండలు మండుతున్న తరుణంలో వాటర్ ఏటీఎంలు మూతబడడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ అధికారుల సమన్వయంతో వాటర్ ఏటీఎంలను పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకురావాలంటూ ప్రజలు కోరుతున్నారు.