రవీంద్రభారతి, ఫిబ్రవరి 2 : యువతీయువకులు ప్రతి రోజు వాకింగ్, రన్నింగ్, క్రీడల్లో పాల్గొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మార్చి 2న జరిగే రాచకొండ రన్నర్స్ నిర్వహించబోయే ‘ఆరోగ్య రన్’ వాల్పోస్టర్ను ఆదివారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహానా యక్, హైదరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాముయాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. యువత, విద్యార్థులు ప్రతి రోజు వాకింగ్, రన్నింగ్, కీడల్లో పాల్గొని సంపూ ర్ణ ఆరోగ్యంగా ఉండి..చదువుల్లో రాణించాలని సూచించారు.
యువతతోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని తెలిపారు. అందుకే యువత ఎలాంటి దురాలవాట్లు లేకుండా క్రమశిక్షణతో ఆరోగ్య సూత్రాలు పాటిస్తే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అనూష, రవి, వినయ్నాయక్, లావణ్య, నితిన్, తదితరులు పాల్గొన్నారు.