BRS | గోల్నాక, ఏప్రిల్ 21: ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హైదరాబాద్ అంబర్పేట డివిజన్ విశ్వబ్రాహ్మణ సమైక్య సంఘం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం పటేల్ నగర్లో కార్పొరేటర్ విజయ్ కుమార్ కలసి ఆ సంఘం ప్రతినిధులు కలిసి రజతోత్సవ సభకు తాము స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణుల నిర్ణయాన్ని స్వాగతించిన కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు నిండాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పెంటం చారి, నరేందర్ చారి, లక్ష్మణ్ చారి, అశోక్ చారి, శ్రీకాంత్ చారి, ముకుందా చారి, బాలకృష్ణ చారి, నరేందర్ చారి, సంతోచారి తదితరులు పాల్గొన్నారు.