సిటీ బ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ సర్కార్ సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించింది. 400 ఎకరాల భూవివాదంపై తుది తీర్పు వెలువడేదాకా అక్కడ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడొద్దని సుప్రీం కోర్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కానీ.. సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేస్తూ వివాదాస్పద 400 ఎకరాల్లో ఉన్న మష్రూమ్ రాక్స్ పక్కన అధికారులు ఓ పొడవాటి స్తంభాన్ని ఏర్పాటు చేశారు. భూవివాదంపై తుది తీర్పు వచ్చేదాకా అన్ని పనులు నిలిపేయాలని స్పష్టమైన ఆదేశాలున్నా ప్రభుత్వం స్తంభం పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.