HYDRAA | రాయదుర్గం, జనవరి 22 : హైడ్రా టెలికాంనగర్ సర్వేనెంబర్ 91 లో కూల్చివేతలను చేపట్టింది. టెలికాంనగర్‌లో 2000 గజాల్లో పార్కు ఉండగా.. పార్కులో 5 గుడిసెలున్నాయి. తాము గత 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని.. హైడ్రా అధికారులు తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివతలను చేపడుతున్నారని స్థానిక బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు హైడ్రాకు వచ్చిన ఫిర్యాదు మేరకు కూల్చివేతలను చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. 59 జీవో కింద తాము ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నామని.. ప్రభుత్వం నుండి 125 గజాలుపైన భూమి ఉంటే దానికి డబ్బులు కట్టాలని మాకు నోటీసులు ఇచ్చారని అంటున్నారు బాధితులు.
టెలికాం నగర్ 91 సర్వే నంబర్లో ఎన్నో పెద్ద పెద్ద అక్రమాలు ఉన్నాయని.. కానీ హైడ్రాధికారులు వాటి జోలికి వెళ్లకుండా చిన్న గుడిసెలు వేసుకుంటే వాటిని కూలుస్తున్నారు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.