 
                                                            జూబ్లీహిల్స్,అక్టోబర్30: బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని.. రాష్ర్టానికి పూర్వ వైభవం తెచ్చేందుకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపుతో శ్రీకారం చుట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ గురువారం యూసుఫ్‌గూడ డివిజన్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతినగర్‌లోని సాయిరాం మనోహర్ అపార్ట్మెంట్లో డోర్ టూ డోర్ క్యాంపెయినింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అశీష్ కుమార్ యాదవ్, వాసాల వెంకటేష్, పవన్ రెడ్డి, ఆయా పోలింగ్ స్టేషన్ల ఇన్ఛార్జీలు నర్సింగ్ దాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
                            