హైదరాబాద్ : తినడానికి తిండి దొరక్కపోవడంతో.. బుక్కెడు బువ్వ కోసం ఓ వృద్ధ యాచకురాలు ఎదురుచూస్తోంది. ఆకలితో అలమటిస్తోన్న ఆ యాచకురాలిని గమనించిన ఓ ట్రాఫిక్ హోంగార్డు ఆమెను చేరదీశాడు. ఆ వృద్ధురాలికి ఆహారంతో పాటు పండ్లు, నీరు అందజేసి గొప్ప మనసు చాటుకున్నాడు ఉప్పల్ ట్రాఫిక్ హోంగార్డు కిరణ్. ఈ దృశ్యం రామంతాపూర్ విశాల్ మార్ట్ వద్ద సోమవారం ఉదయం వెలుగు చూసింది.