రామంతాపూర్, నవంబర్ 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి.. తనను ఆశీర్వదించాలని ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాచారం డివిజన్లోని పలు కాలనీల్లో కార్పొరేటర్ శాంతిసాయి జెన్శేఖర్తో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం చేశారు. ఓటర్లను కలిసి ఆత్మీయంగా పలుకరించారు. మహిళలు, ఓటర్లు, పలుకాలనీల వాసులు బండా రి లక్ష్మారెడ్డికి పూలమాలు వేస్తూ మంగళహారతులు పట్టా రు. ఈ సందర్భంగా బీఎల్ఆర్ మాట్లాడుతూ.. ఉప్పల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని న్నారు. ఉప్పల్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. బండారిని లక్ష మెజార్టీతో గెలిపిస్తామని పలు కాలనీల వాసులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా నాచారం ఓల్డ్ విలేజ్‌లో బం డారి లక్ష్మారెడ్డికి తమ పూర్తి మద్దతు ఇస్తున్నామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
చిలుకానగర్ డివిజన్లో ..
చిలుకానగర్‌లో డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మల్లికార్జుననగర్‌లో వడ్డెర సంఘం అధ్యక్షుడు వరుసు లింగయ్య, సంఘం సభ్యులు 100 మంది బండారి లక్ష్మారెడ్డికి తమ మద్దతు ప్రకటించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈసందర్భంగా బండారి లక్ష్మారెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. వడ్డెర సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, శ్రీశైలం, ఎండీ కాసిం, ఓర్పు రవి, ఎస్. రాజు, నరహరిచారి, బాల య్య, రామకృష్ణ, సునీత, మహేశ్వరి, కృష్ణసుందర్, లక్ష్మమ్మ, శివ, యాదమ్మతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
భారీ మెజార్టీతో గెలిపిస్తాం..
ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ శాంతిసాయిజెన్శేఖర్ స్పష్టం చేశారు. బుధవారం నాచారంలోని పలుప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 400కే గ్యాస్ సిలిండర్ అంటూ ప్లకార్డులు పట్టుకొని వినూత్నంగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికే రాష్ర్టాన్ని అభివృద్ధి చేసే సత్తా ఉందన్నారు. అభివృద్ధి చేసే ప్రభుత్వానికే ఓటర్లు ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
హబ్సిగూడ డివిజన్లో..
హబ్సిగూడ డివిజన్లోని పలు కాలనీల్లో పలువురు మహిళలు బీఆర్ఎస్ అభ్యర్థి బీఎల్ఆర్ను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు యాదమ్మ, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మితోపాటు పలువురు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రచారానికి అపూర్వ స్పందన..
చర్లపల్లి, నవంబర్ 1 : చర్లపల్లి డివిజన్లో చేపడుతున్న బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన వస్తుందని స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నా రు. బుధవారం డివిజన్ పరిధిలోని అంబేద్కర్‌నగర్, తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ అందించేందుకు డివిజన్లో ప్రచారంను ముమ్మరం చేస్తున్నామని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించి ప్రచారం చేస్తున్నామని, ప్రచారంలో కాలనీవాసులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని ఆమె తెలిపారు.
డివిజన్లో బూత్‌కమిటీలు ఏర్పాటు చేశామని, బూత్‌ల వారీ గా ప్రచారం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, నేమూరి మహేశ్‌గౌడ్, కనకరాజుగౌడ్, పండాల శివకుమార్‌గౌడ్, జాండ్ల సత్తిరెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, కడియాల యాదగి రి, లక్ష్మారెడ్డి, గిరిబాబు, కొమ్ము సురేశ్, కడియాల బాబు, కొమ్ము రమేశ్, సానెం రాజుగౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, ఆనంద్‌రాజు గౌడ్, రెడ్డినాయక్, సుభాష్, మురళి, పాండు, వెంకట్‌రెడ్డి, న జీర్, పుష్పలత, అలీ, బాల్‌నర్సింహా, నవనీత, సత్తెమ్మ, లలి త, సోమయ్య, ముత్యాలు, రాధకృష్ణలతో పాటు పెద్ద సంఖ్య లో కాలనీవాసులు పాల్గొన్నారు.