మారేడ్పల్లి, జనవరి 12 : రైలు(Train) కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య(Commits suicide) చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సికింద్రాబాద్-సీతాఫల్మండి ఏ క్యాబిన్ వద్ద ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుడి వయసు సూమారు 40-45 సంవత్సరాలు ఉంటాయని, ఒంటి పై ఎరుపు రంగు టీ షర్టు, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఆత్మహత్యకు గల కారాణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.