బంజారాహిల్స్,జనవరి 28 : బైక్ మీద వేగంగా వెళ్తూ( Rash driving) కారును ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఫిలిం నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫస్ట్ లాన్సర్ సమీపంలోని సయ్యద్‌నగర్‌కు చెందిన విద్యార్థి(17) తన స్నేహితుడి(17)తో కలిసి అర్ధరాత్రి దాటిన తర్వాత బైక్ మీద బంజారాహిల్స్ రోడ్ నెం 12 నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం 92మీదుగా వెళ్తున్నారు.
ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా స్థానికులు అంబులెన్స్‌లో ఉస్మానియా హాస్పిటల్లో చేర్పించారు. బైక్ నడిపిన యువకుడికి లైసెన్స్ లేదని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో పాటు కారును ఢీకొట్టిన విద్యార్థి మీద బీఎన్ఎస్ 125(ఏ), 281తో పాటు ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వి కూడా చదవండి..
KTR | మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సిగ్గుందా అని అడుగుతున్నా : కేటీఆర్
KTR | రైతుబంధు కొనసాగిస్తే ఆయననెవరూ దేకరని రేవంత్‌రెడ్డి భయం : కేటీఆర్
KTR | రేవంత్‌రెడ్డి దృష్టిలో మోసం చేసుడు కూడా చారిత్రాత్మకమే : కేటీఆర్