హైదరాబాద్ : మూతపడిన పరిశ్రమలో విద్యుదాఘాతానికి(Electric shock )గురై ఇద్దరు కార్మికులు మృతి (Workers died)చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్(Medchal) పోలీస్ స్టేషన్ పరిధి కండ్లకోయలోని ఓ ప్రైవేట్ కంపెనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వాహనంలో నిచ్చెనను తరలిస్తుండగా ప్రమాదవశాత్తు హైటెన్షన్ తీగలు తగిలి గుడుబైట(26), మంగీ(25) అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Deputy CM Bhatti | సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : డిప్యూటీ సీఎం భట్టి
HYDRAA Vs GHMC | హైడ్రా కమిషనర్.. ఆమ్రపాలి మధ్య ఆధిపత్య పోరు