ఖైరతాబాద్, మే 30 : ఇంటి నుంచి బయటకు వెళ్లి ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ్‌నగర్‌కు చెందిన రెడ్డి నాగేశ్వర్ రావు (48) ఈ నెల 21న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గత తొమ్మిది రోజులుగా కుటుంబ సభ్యులు అతని ఆచూకి కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెడ్డి నాగేశ్వర్ రావు మానసిక స్థితి సరిగా లేదని, ఇప్పటికే 10 సార్లకు పైగా ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ అదృశ్యం
ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఓ మహిళా వెళ్లిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌కు చెందిన ఫాతిమా అలియాస్ రాజమ్మ (43) ఈ నెల 22న ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. వారం రోజులు గడిచినా తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పచ్చరంగు చీర ధరించిన ఫాతిమా ఆచూకి తెలిసిన వారు ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.