శంషాబాద్ రూరల్, అక్టోబర్ 17 : రేషన్‌కార్డులో కొడుకు పేరు నమోదు కోసం శంషాబాద్‌కు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన తల్లీకొడుకు అదృశ్యమైన ఘటన శుక్రవారం శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చిన్నగోల్కొండ గ్రామానికి చెందిన కమ్మరి మౌనిక(30)ఆమె కొడుకు మణివర్ధన్ ఇద్దరు ఈ నెల 15న శంషాబాద్‌కు వెళ్లి కొడుకు పేరు రేషన్‌కార్డులో నమోదు చేసుకొని వస్తానని చెప్పిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం భర్త బ్రహ్మచారి షాబాద్ మండలంలోని చదన్వెళ్లి గ్రామానికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
తన స్నేహితురాలికి ఆధార్‌కార్డు ఇవ్వడానికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన శుక్రవారం శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మేకల బండతండాకు చెందిన కేతావత్ దేవి(20) ఈ నెల 15న రాత్రి 9 గంటల సమయంలో తన స్నేహితురాలికి ఆధార్‌కార్డు ఇస్తానని వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఫలితం దక్కలేదు. ఆరు నెలల క్రితం వివాహం చేయడానికి నిశ్చితార్థ్ధం జరిగింది. దీంతో ఆమె అదృశ్యంపై పాలమాకుల గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.