హైదరాబాద్ : ప్రభుత్వ దవాఖానలో(Medical students) స్లాబు పై పెచ్చులు ఊడి పోయి(Roof collapsed) ఇద్దరు గాయపడ్డారు( Injured). ఈ విషాదకర సంఘటన రామాంతపూర్లోని డీకే గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో(Homeopathic hospital) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెడికల్ హాస్పిటల్లో పేషెంట్ వార్డులోని పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినుల తలలు పగిలాయి. ఒక విద్యార్థినికి స్వల్ప గాయాలు కాగా, మరో విద్యార్థినికి తలపై తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.