Wines Closed | మందబాబులకు పోలీసులు షాక్ ఇచ్చారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో వైన్స్‌లు క్లోజ్ చేయాలని హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గణేశ్ నిమజ్జనం ఉత్సవాల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయించినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని స్పష్టం చేశారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టార్ హోటల్ బార్స్, రిజిస్టర్ క్లబ్స్‌కు ఆదేశాలు వర్తించవచని పోలీసులు తెలిపారు.