హైదరాబాద్ : గంజాయి(Ganja) సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిరంతరం తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాను కట్టడి చేస్తున్నారు. తాజాగా ధూల్‌పేట్‌లోని(,Dhulpet)జుమ్మెరాత్ బజారులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గంజాయి అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.
గంజాయి విక్రయిస్తున్న మనోజ్ సింగ్ , ఎండీ రాజ్ పటేల్‌లను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 1.247కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితోపాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముఖేష్ సింగ్, అర్తిబాయిలపై కేసు నమోదు చేశామని, వీరిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.