Hyderabad | కోఠి ఏటీఎం కాల్పుల కేసులో పురోగతి.. ఇద్దరు నిందితులు అరెస్ట్
హైదరాబాద్ కోఠీలో(Koti) ఏటీఎం వద్ద వ్యాపారిపై కాల్పులు జరిపి నగదుతో పారిపోయిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
హైదరాబాద్ : హైదరాబాద్ కోఠీలో(Koti) ఏటీఎం వద్ద వ్యాపారిపై కాల్పులు జరిపి నగదుతో పారిపోయిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఇద్దరు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్‌లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో జనవరి 31 ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో(ATM) డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ.6లక్షల వరకు ఎత్తుకెళ్లారు. ఉదయం 7 గంటలకు రషీద్ అనే వ్యక్తి బ్యాంక్ ఏటీఎంలో రూ.6లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు బ్యాంక్ స్ట్రీట్‌కు వచ్చాడు.
రషీద్ డబ్బులతో రావడం గమనించిన కొందరు దుండగులు అతడిని వెంబడించారు. అది గమనించి రషీద్ పారిపోతుండటంతో అతనిపై కాల్పులు జరిపి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రషీద్ కాలికి గాయమైంది. దీనిపై సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రషీద్‌ను హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

